కరోనా మరణమృదంగం... 450కి చేరిన మృతులు!

04-02-2020 Tue 09:26 | International
  • మొత్తంగా 20 వేల మందికి సోకిన వ్యాధి
  • పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లు
  • 24 దేశాలకు విస్తరించిన కరోనా
  • తెలంగాణలో ఎవరికీ సోకలేదంటున్న వైద్యులు
చైనాలో కరోనా వైరస్ మరణమృదంగాన్నే సృష్టిస్తోంది. ఈ వ్యాధి సోకినవారిలో ఇప్పటివరకూ 450 మందికి పైగానే మరణించినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. నిన్న సోమవారం ఒక్కరోజే మరో 3,500 మందికి వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వీరందరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మొత్తంగా దాదాపు 20 వేల మందికి పైగా వైరస్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. వీరిలో సుమారు 400 మందిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. మిగతా వారంతా వైరస్ తో బాధపడుతున్నారని, వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు.

కాగా, కరోనా వైరస్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించింది. ఎన్నో దేశాలు విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘాను పెట్టాయి. ఇండియాకు చైనా నుంచి వస్తున్న వారిని రెండు వారాల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని నిర్ణయించిన కేంద్రం న్యూఢిల్లీలో ప్రత్యేక వార్డులను సైన్యం పర్యవేక్షణలో నిర్మించిన సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారందరినీ అక్కడికి తరలించి, 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి, వారిలో వైరస్ లేదని తేలిన తరువాత మాత్రమే బాహ్య ప్రపంచంలోకి పంపుతున్నారు.

కేరళ ప్రభుత్వం స్టేట్ హై అలర్ట్ ను ఇప్పటికే ప్రకటించింది. దేశంలో మూడో కరోనా కేసు వెలుగులోకి రాగా, వారి కుటుంబీకులందరినీ ఐసొలేషన్ వార్డులకు తరలించారు. హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రితో పాటు గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం ప్రత్యేక కిట్లను తెప్పించారు. గడచిన 10 రోజుల్లో దాదాపు 60 మంది అనుమానితులను పరిశీలించిన వైద్యులు, వారిలో 9 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేల్చి, వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. ఇంతవరకూ తెలంగాణలో కరోనా ఎవరికీ సోకలేదని అధికారులు అంటున్నారు.
Corona VirusChinaIndiaHyderabad

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more